pregnancy & parenting
నిజానికి పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే చాలా మంచిది. అవి ఇవి కాకుండా.. DIY ఆర్ట్ కిట్లు, విద్యా కిట్లు, కథల పుస్తకాలు పిల్లల ఆలోచనా శక్తిని పెంచుతాయి.
పిల్లల దగ్గర ఎన్ని తక్కువ బొమ్మలుంటే అంత మంచిది. పిల్లల ముందు ఎక్కువ బొమ్మలుంటే ఏకాగ్రత తగ్గుతుంది. వీటితో ఆడుకోవాలో తెలియదు. తక్కువ బొమ్మలు పిల్లల సృజనాత్మకత, ఏకాగ్రతను పెంచుతాయి.
పిల్లలకు బ్లాక్స్, ప్లే డౌ, లెగో లాంటి ఓపెన్ ఎండ్ బొమ్మలను ఇవ్వాలి. ఇవి వారి మెదడు వికాసానికి మంచివి. అలాగే వారిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంచుతాయి.
తక్కువ ధర, నాణ్యతలేని బొమ్మలను కాకుండా.. మంచి నాణ్యమైన, చెక్క బొమ్మలను కొన్నివ్వాలి. ఇవి పిల్లలకు ఎలాంటి హాని చేయవు. చాలా రోజుల వరకు మన్నిక వస్తాయి.
పిల్లల్ని బొమ్మలతో చాలా సేపు ఆడుకోనివ్వాలి. దీనివల్ల మీ పిల్లల్లో ఓర్పు, ఏకాగ్రత, మానసిక వికాసం పెరుగుతాయి.
అయితే ప్రతి తల్లిదండ్రులు పిల్లల వయసును బట్టి బొమ్మలను కొనివ్వాలి. ఇవి వారి చదువుకు, ఆలోచనాత్మకు చాలా మంచిది.