pregnancy & parenting
ఐశ్వర్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కూతురు ఆరాధ్య కోసం సమయం కేటాయిస్తుంది. స్కూల్ ఫంక్షన్స్, చిన్న విజయాల్లో తల్లులు పిల్లలకుు అందుబాటుల ఉండాలి.
ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్య చదువుకు ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరించాలి. రెగ్యులర్ చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి.
ఐశ్వర్య ఆరాధ్యకు బచ్చన్ కుటుంబ విలువలను నేర్పింది. పిల్లలకు గౌరవం, దయ, క్రమశిక్షణ ప్రాముఖ్యతను నేర్పాలి. కుటుంబంతో సమయం గడపడం అలవాటు చేయాలి.
కెమెరా ముందు మర్యాదగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం ఆరాధ్యకు ఐశ్వర్య నేర్పింది. పిల్లలకు ఆత్మవిశ్వాసం కలిగించాలి. ఇతరులతో బాగా ప్రవర్తించడం నేర్పాలి.
చిన్నప్పటి నుంచే ఆరాధ్య స్వయం సమృద్ధిగా ఉండేలా ఐశ్వర్య ప్రోత్సహించింది. పిల్లలు చిన్న చిన్న పనులు తామే చేసుకునేలా, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశం ఇవ్వాలి.
ఐశ్వర్య తన ఆరోగ్యం, కూతురు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అలవాటు చేయాలి. స్క్రీన్ టైమ్ తగ్గించి, బయట ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
విమర్శలను ఎలా ఎదుర్కోవాలో ఐశ్వర్య ఆరాధ్యకు నేర్పింది. విమర్శలు జీవితంలో ఒక భాగమని పిల్లలకు వివరించాలి. సానుకూలత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నేర్పాలి.