pregnancy & parenting
ఏ పిల్లలైనా సరే వాళ్ల నాన్న ఎప్పుడూ ఓపికగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కోపగించుకోకుండా వారికి సహకరించాలని, మార్గనిర్దేశం చేయాలని ఆశపడతారు.
ఏ పిల్లవాడికైనా సరే తండ్రే ఫస్ట్ ఫ్రెండ్. పిల్లలకు కాస్ట్లీ గిఫ్ట్ ల కంటే.. నాన్నతో గడిపిన సమయమే చనిపోయే వరకు గుర్తుంటుంది. అందుకే నాన్నతో రోజూ ఆడుకోవాలని పిల్లలు ఆశపడతారు.
పిల్లలు ఎవ్వరిని నమ్మినా, నమ్మకపోయిన నాన్నని ఖచ్చితంగా నమ్ముతారు. అందుకే పిల్లలు వాళ్ల నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అవసరమైనప్పుడు వారికి తోడుగా ఉండాలని కోరుకుంటారు.
మంచి క్రియేటివీ నైపుణ్యాలున్న తండ్రి వారి పిల్లల్ని ఊహల ప్రపంచంలోకి తీసుకెళ్లగలడు. ఇలాంటి పిల్లల్ని రోజువారీ సమస్యలకు దూరంగా ఉంచి వారికి సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు.
మీకు తెలుసా? పిల్లలకు వారి నాన్న ఉదయం ఆఫీసుకు వెళ్లడం అస్సలు ఇష్టముండదు. నాన్న మాతోనే ఉంటే బాగుండు అని పిల్లలు కోరుకుంటారు. ఎందుకంటే తండ్రే వారికి రక్షణ అని భావిస్తారు.
పిల్లలు వారి నాన్న తమని అర్థం చేసుకుంటే బాగుండని కోరుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ల నాన్న పిల్లలకు సపోర్ట్ గా నిలుస్తున్నట్టు. ఇది పిల్లలు, తండ్రుల మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
సరదాగా ఉండే తండ్రులు పిల్లల జీవితాన్ని ఆనందమయంగా చేస్తారు. పిల్లల కష్టకాలంలో ధైర్యాన్ని నింపి వారి ముఖంలో చిరునవ్వును చూస్తాడు. అందుకే ఈ క్వాలిటీని తమ తండ్రిలో చూడాలనుకుంటారు.