మన కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్యాక్ చేసిన ఆహారం, సూప్, షుగర్ ఉండే ఆహారాలు పిల్లలకు దూరంగా ఉంచాలి.
సూప్ ప్యాకెట్స్
ప్యాకేజ్డ్ సూప్ లో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యానికి హానికరం. ఇంట్లో తయారుచేసిన కూరగాయల సూప్ ఇవ్వండి.
బిస్కెట్లు, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్
వీటిలో ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదల, ఆరోగ్యానికి హానికరం. పండ్లు, ముర్మురాలు, పునుగులు, పాప్‌కార్న్ వంటివి స్నాక్స్‌గా ఇవ్వండి.
సెరల్స్
మార్కెట్లో దొరికే సెరల్స్ లో చక్కెర, కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల శక్తి స్థాయిలు, మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.
ఇన్‌స్టంట్ నూడుల్స్
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో మైదా, సోడియం, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి పిల్లల జీర్ణవ్యవస్థకు హానికరం. పోషకమైన ఇంట్లో తయారుచేసిన నూడుల్స్ ఇవ్వండి.
కెచప్
కెచప్‌లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల దంతాలు, జీవక్రియపై చెడు ప్రభావం చూపుతాయి. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి.