pregnancy & parenting

ఉదయాన్నే పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలి?

పిల్లలకు మంచి సంస్కారం నేర్పాలంటే..

పిల్లలకు మంచి సంస్కారం నేర్పాలంటే ఉదయాన్నే కౌగిలించుకొని, మంచి ప్రోత్సాహాకర మాటలు చెప్పాలి. నీతి కథలు చెప్పాలి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి.

 

 

కౌగిలించుకోండి

ఉదయాన్నే పిల్లల్ని కౌగిలించుకుని, ముద్దు పెట్టుకుని, ప్రేమగా మాట్లాడండి. దీనివల్ల ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్) విడుదలై, వాళ్ళ మెదడు ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ప్రోత్సాహకర మాటలు

పిల్లలతో సానుకూలంగా మాట్లాడండి. "నువ్వు చాలా తెలివైనవాడివి" లాంటి మాటలు వాళ్ళ ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి. మీరు నేర్పాలనుకునే విషయాలు చెప్పండి.

నీతి కథలు చెప్పండి

ప్రేరణాత్మక కథల ద్వారా మంచి, చెడుల గురించి నేర్పి, మంచి సంస్కారాలు పెంపొందించండి. మీ పిల్లల్లో చూడాలనుకునే లక్షణాల గురించి కథల రూపంలో చెప్పండి.

రోజంతా ఉత్సాహంగా

ఉదయం మొదటి గంట పిల్లల రోజంతా ప్రభావితం చేస్తుంది. ప్రేమ, ప్రోత్సాహం, కథలతో ఆరంభమైతే రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా ఉంటుంది.

ఈ అలవాట్ల ప్రభావం

ఉదయాన్నే ఈ మూడు పనులు చేస్తే పిల్లలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఇది వాళ్ళ మానసిక, భావోద్వేగ ఆరోగ్యానికి మంచిది.

ఐశ్వర్యా రాయ్ నుంచి తల్లులు నేర్చుకోవాల్సింది ఇదే

పిల్లలు తొందరగా నేర్చుకునే చెడు అలవాట్లు ఇవే

చిన్న పిల్లలకు ఇవి మాత్రం తినిపించకూడదు

పిల్లల ముందు పేరెంట్స్ ఈ పనులు అస్సలు చేయకూడదు