పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్: వీరు ఇండియాలో రిచ్చెస్ట్ ఫార్మర్స్
రిచ్చెస్ట్ ఫార్మర్స్
రైతంటేనే పేదవారు... వ్యవసాయం అంటేనే పేదవాళ్లు చేసుకునే పని అనే భావన ప్రస్తుత సమాజంలో వుంది. కానీ వ్యవసాయం ద్వారా కోట్లు సంపాదించే రైతులు కూడా భారతదేశంలో వున్నారు.
దేశంలోనే ధనిక రైతు ఈ రామ్ శరణ్ వర్మ
ఈ రైతు పేరు రామ్ శరణ్ వర్మ... యూపీలోని బారాబంకి జిల్లాకు చెందినవాడు. ఇతడి వార్షిక టర్నోవర్ దాదాపు రూ.2 కోట్లు. ఇతను 200 ఎకరాల్లో కూరగాయలు, పండ్లను సాగు చేస్తాడు
హెలికాప్టర్ లో పొలానికి వెళ్లే రైతు
ఇతను బీహార్ కు చెందిన రైతు డాక్టర్ రాజారామ్ త్రిపాఠి. ఈయన ఏకంగా 1000 ఎకరాల భూమిలో జాజికాయ, నల్ల మిరియాలు సాగు చేస్తాడు. వ్యవసాయంలో హెలికాప్టర్‌ను వాడే ఇతడి ఆదాయం రూ.25 కోట్లు.
విదేశాన్ని వదిలి స్వదేశంలో వ్యవసాయం
మహారాష్ట్రకు చెందిన సచిన్ కాలే ఫ్రాన్స్‌లో మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు అతడు కోట్లు సంపాదిస్తున్నాడు
బంజరు భూమి నుండి బంగారం సాగు
దేశంలో ధనిక రైతుల జాబితాలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన హరీష్ ధన్దేవ్ ఉన్నారు. అతను శాస్త్రీయంగా కలబందను సాగు చేయడం ద్వారా సంవత్సరానికి 1.5 నుండి 2 కోట్లు సంపాదిస్తాడు
రైతు నుండి వ్యాపారవేత్త వరకు: జనార్దన్ భోయిర్
రైతుగా మారిన ఈ వ్యాపారవేత్త జనార్దన్ భోయిర్, మహారాష్ట్రలోని భివాండికి చెందినవాడు. అతను తన పాడి వ్యాపారం, వ్యవసాయం కోసంరూ.30 కోట్ల రూపాయలకు హెలికాప్టర్ కొన్నాడు