970000000 రూపాయలు ... ఓ కానిస్టేబుల్ లావాదేవీల లెక్కిది
మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ
మధ్యప్రదేశ్లో గత వారం రోజులుగా మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ పేరు చర్చనీయాంశంగా మారింది. అతడి ఇంటిపై దాడిచేసిన లోకాయుక్త దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మాజీ కానిస్టేబుల్ ఇంట్లో కోట్లకు కోట్లు
సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త బృందం కోట్ల రూపాయల నగదు, బంగారం, వెండితో పాటు పలు డాక్యుమెంట్లు, డైరీలను స్వాధీనం చేసుకుంది.
డైరీలో రూ.97 కోట్ల లావాదేవీలు
సౌరభ్ వద్ద దొరికిన డైరీలు డిసెంబర్ 2024 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 97 కోట్ల రూపాయల లావాదేవీల రికార్డు ఉంది. వీటన్నింటినీ సీజ్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రవాణా శాఖపై నిఘా
సౌరబ్ ఘటనతో మధ్యప్రదేశ్ రవాణా శాఖ మొత్తం నిఘాలో ఉంది. ఈ కేసులో రవాణా శాఖ ఉన్నతాధికారులు, నాయకుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రులు, అధికారుల అనుచరుడు
సౌరభ్ శర్మ పలువురు మంత్రులు, అధికారుల అనుచరుడని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎవరితోనూ ప్రత్యక్ష సంబంధం బయటపడలేదు.
కారులో 52 కిలోల బంగారం, 11 కోట్ల నగదు
భోపాల్లోని మెండోరి అడవిలో గురువారం రాత్రి లోకాయుక్త బృందం 52 కిలోల బంగారం, 11 కోట్ల నగదుతో ఉన్న కారును స్వాధీనం చేసుకుంది. ఈ కారు సౌరభ్ శర్మదేనని చెబుతున్నారు.