NATIONAL
డా.బిఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో రాజకీయ రగడ రేపుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ లో ఇవాళ పెద్ద గందరగోళం చోటుచేసుకుంది.
ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్, బిజెపి ఎంపీలు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగి బిజెపి ఎంపి ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు.
అయితే తనను రాహుల్ గాంధీ తోసేశారని సారంగి ఆరోపించడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో ఓ ఎంపీపై మరో ఎంపి దాడిచేసినా, గాయపర్చినా ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలున్నాయి. వీటిని ఇమ్యూనిటీ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 పార్లమెంట్, సభ్యులకు అధికారాలు, ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.
ఎవరైనా పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్, నిర్బంధం చేయాలన్నా ఆ వివరాలను ముందుగా పార్లమెంట్‌కు తెలియజేయాలి.
స్పీకర్ అనుమతి లేకుండా సభలో ఎంపీని అరెస్ట్ చేయలేరు.
పార్లమెంట్‌లో ఎంపీల మధ్య తోపులాట, దాడి సంఘటనపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. అసలు ఏం జరిగిందో తెలియాలి...అప్పుడే ఎవరిపై అయినా చర్యలుండేది.