NATIONAL

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన మన్మోహన్ సింగ్... అదేంటో తెలుసా?

మన్మోహన్ సింగ్ తీరని కోరిక

92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీరని కోరికతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.

సొంతూరిని మరవని మన్మోహన్

సెప్టెంబర్ 26, 1932న పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు మన్మోహన్ సింగ్. దేశ విభజన తర్వాత కుటుంబం ఇండియాకు వచ్చినా, ఊరిని మాత్రం మర్చిపోలేదు.

ఊరికి దూరమైనా, జ్ఞాపకాలకు దగ్గరే

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్‌ని నాన్నమ్మ పెంచారు. ఆయన ప్రాథమిక విద్యాబ్యాసం అంతా పాకిస్థాన్ లోని పెషావర్ లో సాగింది, విభజన తర్వాత ఇండియా వచ్చేశారు.

పాకిస్తాన్ క వెళ్లిన ఆ కోరిక మాత్రం తీరలేదు

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాకిస్తానీ స్నేహితుడితో కలిసి రావల్పిండి వెళ్లినా  సొంతూరికి వెళ్లలేకపోయానని మన్మోహన్ సింగ్ బాధపడ్డారని రాజీవ్ శుక్లా చెప్పారు.

దేశ ప్రధాని అయినా ఆ కోరిక మిగిలిపోయింది

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌లోని తన ఊరు, చదువుకున్న స్కూల్ చూడాలనుకున్నారని... కానీ వెళ్లలేకపోయారని రాజీవ్ శుక్లా చెప్పారు.

మనసులో మాట చెప్పారు మన్మోహన్

ఒకసారి పీఎం హౌస్‌లో వుండగా తనతో 'పాకిస్తాన్ వెళ్లాలని ఉంది, ఊరు చూడాలని ఉంది' అని మన్మోహన్ చెప్పారని రాజీవ్ శుక్లా వెల్లడించారు.

మన్మోహన్ కు అక్కడ సొంతిల్లు లేదా?

సొంతిల్లు ఎలాగూ ఇప్పుడు లేదు కనీసం నాలుగో తరగతి వరకు చదువుకున్న స్కూల్ చూడాలనుకుంటున్నానని మన్మోహన్ సింగ్ అన్నారట..

మన్మోహన్ సింగ్ ఊరి పేరు

చదువుకున్న స్కూల్ చూడాలన్న కోరిక తీరలేదు. ఆ స్కూల్ పాకిస్తాన్‌లోని 'గాహ్' అనే ఊళ్లో ఉంది. దాని పేరు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్.

వీడి జీతం రూ.13,000... కానీ ప్రియురాలికి వజ్రాల కళ్లద్దాలు గిప్ట్

ఒకేసారి 100 లీటర్ల పాాలిచ్చే ఆవు ... ఏదో తెలుసా?

970000000 రూపాయలు ... ఓ కానిస్టేబుల్ లావాదేవీల లెక్కిది

పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్: ఇండియాలో రిచ్చెస్ట్ ఫార్మర్స్ వీళ్ళే