NATIONAL
కేవలం ₹13,000 జీతం తీసుకునే 23 ఏళ్ల యువకుడు ₹21 కోట్లు దొంగిలించాడు. ప్రియురాలికి 4BHK ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన ఈ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి హర్షల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీడికి సహకరించిన యశోద శెట్టి, ఆమె భర్త బికె జీవన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
డబ్బు దోచుకోవడానికి హర్షల్ ఎంత పకడ్బందీ ప్రణాళిక వేసాడో దర్యాప్తులో తేలింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత లెటర్ హెడ్ ఉపయోగించి బ్యాంకుకు ఈమెయిల్ చిరునామా మార్చమని అభ్యర్థించాడు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాతాకు దగ్గరగా ఉండే చిరునామాతో కొత్త ఈమెయిల్ ఖాతా తెరిచాడు - కేవలం ఒక అక్షరం మాత్రమే మార్చాడు. దీన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానించాడు.
లావాదేవీలకు అవసరమైన OTP, ఇతర సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగాడు. ఇలా డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమిటీ బ్యాంక్ ఖాతాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేశాడు.
ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 7 మధ్య 13 బ్యాంక్ ఖాతాలకు ₹21.6 కోట్లు బదిలీ చేశాడు. ₹1.2 కోట్ల బిఎండబ్ల్యూ కారు, ₹1.3 కోట్ల ఎస్ యూవి, ₹32 లక్షల బిఎండబ్ల్యూ బైక్ కొన్నాడు.
ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయం దగ్గర ప్రియురాలికి హర్షల్ విలాసవంతమైన 4 BHK ఫ్లాట్, వజ్రాలతో అలంకరించిన కళ్లద్దాలు బహుమతిగా ఇచ్చాడు.