NATIONAL

కేజ్రీవాల్ చిన్నప్పటి పేరేంటో తెలుసా?

కేజ్రీవాల్ కుటుంబం

కేజ్రీవాల్ కుటుంబ సభ్యులందరూ చదువుకున్నవారే.  ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులే కాదు భార్య, బిడ్డలు కూడా మంచి విద్యావంతులే. 

కేజ్రీవాల్ చిన్ననాటి సంగతులు

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతున్న కేజ్రీవాల్ చిన్ననాటి సంగతుల గురించి ఆయన చెల్లెలు చెప్పారు.

కేజ్రీవాల్ గురించి ఆయన చెల్లి ఏమన్నారంటే

కేజ్రీవాల్ చెల్లెలు రంజనా గుప్తా తన సోదరుడి గురించి ఆసక్తికర విషయాాలు చెప్పారు. తన సోదరుడు చిన్నప్పటి నుంచీ చదువులో మునిగి ఉండేవారని చెప్పారు. 

మూడు తరాల ఇంజనీర్లు

కేజ్రీవాల్ ఐఐటీయన్, ఆయన తండ్రి గోవింద్ రామ్ కూడా ఇంజనీర్. తల్లి గృహిణి.  

హర్షిత, పుల్కిత్ కూడా ఐఐటీయన్లు

కేజ్రీవాల్ పిల్లలు హర్షిత, పుల్కిత్ కూడా ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందారు.

భార్య సునీత మాజీ ఐఆర్ఎస్

కేజ్రీవాల్ భార్య సునీత మాజీ ఐఆర్ఎస్ అధికారి. ఆమె స్వచ్ఛందంగా విఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు భర్తకు రాజకీయాల్లో సహాయం చేస్తున్నారు.

సోదరుల వృత్తులు

కేజ్రీవాల్‌కి నలుగురు తోబుట్టువులు. తమ్ముడు మనోజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, చెల్లెలు రంజనా గుప్తా వైద్యురాలు.

Image credits: social media

సోదరుల చదువు

కేజ్రీవాల్, ఆయన తోబుట్టువులు హర్యానాలోని హిస్సార్‌లో పుట్టి, అక్కడే ప్రాథమిక విద్య చదివారు. కేజ్రీవాల్‌కి ఢిల్లీలో ఉద్యోగం రావడంతో కుటుంబం ఢిల్లీకి వెళ్ళింది.

కేజ్రీవాల్ చెల్లెలు వైద్యురాలు

కేజ్రీవాల్ చెల్లెలు రంజనా గుప్తా వైద్యురాలిగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉంటున్నారు. ఆమె భర్త అజయ్ గుప్తా అక్కడే భెల్ ఫ్యాక్టరీలో వైద్యుడు. వారికి ఇద్దరు పిల్లలు.

చిన్ననాటి పేరు

కేజ్రీవాల్ చిన్ననాటి పేరు కృష్ణ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆయన జన్మాష్టమి రోజున పుట్టడంతో చిన్నప్పుడు కుటుంబంలో కృష్ణ అని పిలిచేవారు.

చిన్నప్పుడు కృష్ణ అనేవారు

కుటుంబ సభ్యులందరూ చిన్నప్పుడు ఢిల్లీ మాజీ సీఎంని కృష్ణ అనే పిలిచేవారు. పెద్దయ్యాక అరవింద్ అయ్యారు.

నెహ్రూ ఏం చదివారో తెలుసా

ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ మన ఇండియాలో ఎక్కడుందో తెలుసా?

లోయలో పడ్డ బస్సు.. 36 మంది మృతి

అమిత్ షా జైలుకు కూడా వెళ్లారు: ఎందుకో తెలుసా?