Lifestyle
ఎక్కువ కాలం కలయికకు దూరంగా ఉండే వారిలో ఒత్తిడి పెరుగుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. కలయిక సమయంలో ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది.
శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండే పురుషుల్లో అంగస్తంభన సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
శృంగారికి ఎక్కువ కాలం దూరంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
కలయిక సమయంలో శరీరంలో డోపామైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మంచి నిద్రకు దోహదపడుతుంది. అయితే కలయికకు ఎక్కువ కాలం దూరంగా ఉండే వారిలో నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మహిళల్లో నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి రావడం సహజం. అయితే తరచూ శృంగారంలో పాల్గొనే మహిళలతో పోల్చితే, ఇతరుల్లో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మరీ ముఖ్యంగా శారీరకంగా ఎక్కువ కాలం కలవకపోతే ఆలుమగల మధ్య ఎమోషన్ బాండింగ్ తగ్గే ప్రమాదం ఉంటుందని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం పలు వేదికల్లో అందబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.