Lifestyle

విదుర నీతి: ఈ 5 అలవాట్లు మిమ్మల్ని త్వ‌ర‌గా చంపేస్తాయి !

Image credits: adobe stock

జనన మరణాల మధ్య జీవితం

విదుర నీతి జీవితం, మరణం గురించి ప్ర‌స్తావిస్తుంది. అంటే జనన మరణాల మధ్య జీవితం ఎలా ఉండాలో కూడా విదుర నీతిలో వివరించార‌రు. 
 

Image credits: adobe stock

ఐదు అలవాట్లు మిమ్మల్ని చంపేస్తాయి

విదుర నీతి ప్రకారం.. మనిషిని కొన్ని అలవాట్లు త్వరగా చంపేస్తాయి. చావుకు చేరువ చేసే ఐదు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image credits: adobe stock

తనను తాను పొగుడుకోవడం

ఏ వ్యక్తి ముందు తనను తాను పొగడకూడదు. ఇతరుల నుండి ప్రశంసలు రావాలి. తనను తాను పొగుడుకుంటూ ఇతరులను విమర్శించేవాడికి ఎప్పుడూ శత్రువులు ఉంటారు.

Image credits: social media

అతిగా మాట్లాడటం

అతిగా లేదా అనవసరంగా మాట్లాడే వారు కూడా మరణానికి దగ్గరగా ఉంటారు. అతిగా మాట్లాడే వ్యక్తి తనకు తానుగా ఇబ్బందులను తెచ్చుకుంటాడు.

Image credits: social media

మితిమీరిన కోపం

మనిషి సామాజిక జంతువు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం మనిషికి మంచిది కాదు. మితిమీరిన కోపం మనిషి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది.

Image credits: freepik

సేవా స్పూర్తి లేకపోవడం

మనిషికి సేవా స్ఫూర్తి, పంచుకునే గుణం ఉండాలి. ఒకరి సామర్థ్యానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని విదురుడు చెప్పాడు.

Image credits: Getty

దురాశ

కోరికలు, కలలు ఉన్నప్పుడే జీవితంలో ముందుకు సాగడం సాధ్యమవుతుంది. కానీ కోరిక ఎప్పుడూ దురాశగా మారకూడదు. ఈ గుణం ఉన్న వ్యక్తులను సమాజం ప్రతికూలంగా చూస్తుంది.

Image credits: social media

గరుడ పురాణం: దీర్ఘాయువు రహస్యమేంటో తెలుసా?

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలుంటే సక్సెస్​ఫుల్ లీడర్స్ అవుతారు !​

నిద్ర లేకుండా చేసే 4 విషయాలు

ఏ ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంతో తెలుసా?