మహాభారత యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ధృతరాష్ట్రుడికి ఎన్నో విషయాలు చెప్పాడు. వీటినే విదుర నీతి అంటారు. ఇందులో జీవితానికి ఉపయోగపడే ఎన్నో సూత్రాలున్నాయి.
నిద్ర పట్టనివ్వని 4 విషయాలు
విదుర నీతి ప్రకారం, ఈ నాలుగు విషయాల వల్ల ఎవరికీ ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఇవి ఏంటో తెలుసుకుందాం...
కామ వాంఛలుంటే...
కామవాంఛలు ఎక్కువగా ఉంటే, ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఈ కోరికలే మనిషిని చెడుదారి పట్టిస్తాయి.
బలవంతుడితో శత్రుత్వం
బలవంతుడితో శత్రుత్వం ఉంటే, ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో ప్రశాంతంగా నిద్ర పట్టదు.
అన్నీ పోతే...
ఎవరికైనా అన్నీ పోతే, వాటి గురించే ఆలోచిస్తూ ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో నిద్ర పట్టదు.
దొంగతనం అలవాటైతే...
దొంగతనం అలవాటైతే, ఎప్పుడూ దొంగతనం గురించే ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్ర పట్టదు.