Lifestyle

మీ మెదడుకు పదనుపెట్టే సరదా ప్రశ్నలు... సరికొత్త జవాబులు

సంవత్సరంలోనూ, శనివారంలోనూ ఒకేసారి వచ్చేది ఏమిటి?

జవాబు: సంవత్సరంలోనూ, శనివారంలోనూ తెలుగు అక్షరం 'వ' ఒకేసారి వస్తుంది.

మీ నగరంలో ఎన్ని ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి?

జవాబు: ఈ ప్రశ్న వినగానే చాలామంది తమ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఆలోచిస్తారు. కానీ, ట్రాఫిక్ లైట్లు అంటే ఎక్కడైనా మూడే రకాలు: ఎరుపు, ఆకుపచ్చ, పసుపు.

వరుసగా 3 రోజుల పేర్లు చెప్పండి.

కానీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాకూడదు?

జవాబు: నిన్న, ఇవాళ, రేపు

ఒక బల్ల మీద ప్లేట్‌లో రెండు ఆపిల్స్ ఉన్నాయి. ముగ్గురు ఎలా తింటారు?

జవాబు: ఒక బల్ల మీద, ప్లేట్‌లో రెండు ఆపిల్స్ ఉన్నాయి. అంటే బల్లమీద కూడా ఓ యాపిల్ వుందన్నమాట.   ముగ్గురు ఒక్కొక్కటి తింటారు.

మీరు అల్పాహారంలో ఏమి తినలేరు?

జవాబు: మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం.

ఒక వ్యక్తి 8 రోజులు ఎలా నిద్రపోకుండా ఉండగలడు?

జవాబు: ఎందుకంటే అతను రాత్రిళ్ళు నిద్రపోతాడు.

Find Next One