చాణక్య నీతి: జీవితంలో సక్సెస్ కావాలంటే కోడి లక్షణాలు మీలో ఉండాల్సిందే
Image credits: adobe stock
చాణక్యనీతి
మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడికి ప్రధాన సలహాదారుడిగా విధులు నిర్వర్తించిన గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, భారత తత్వవేత్వ ఆచార్య చాణ్యకుడు సుపరచితం.
Image credits: adobe stock
ఎన్నో విషయాలు
కౌటిల్యుడిగా పేరొందిన చాణక్యుడు రాజకీయాలు, ఆరోగ్యం, వ్యాపారం, వివాహ జీవితం, సమాజం, నైతిక విలువలు, జీవితానికి సంబంధించిన ఎన్నో నీతి సూత్రాలను చెప్పారు.
Image credits: Instagram
అప్రమత్తంగా
కోడిపుంజు నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. ఏ చిన్న అలికిడి వచ్చినా వెంటనే అలర్ట్ అవుతుంది. మనిషి కూడా పరిస్థితుల విషయంలో అలాగే అలర్ట్గా ఉండాలి.
Image credits: Freepik
ఉదయాన్నే లేవడం
కోడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాల్లో ఉదయం లేవడం ఒకటి. కోడిపుంజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేస్తుంది. జీవితంలో విజయం సాధించిన చాలా మందికి ఉండే ప్రధాన లక్షణాల్లో ఇది ఒకటి.
Image credits: Freepik
కొంచెం కొంచెంగా
కోడి పుంజు ఎప్పుడూ కొంచెం కొంచెంగానే తింటుంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేందుకు ప్రయత్నించదు. మనిషి కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూనే విజయతీరాలకు చేరుకోవాలనే సందేశం ఇందులో ఉంది.
Image credits: freepik
సమానంగా పంచడం
కోడి తాను సేకరించిన ఆహారాన్ని పిల్లలకు సమానంగా పంచుతుంది. ఉన్నదాంట్లో ఇతరులకు పంచాలనే సందేశం ఇందులో దాగి ఉంది.