Lifestyle

మీలో ఈ లక్షణాలున్నాయా? మానసిక ఒత్తిడి ఉన్నట్లే..

Image credits: Pexels

నొప్పులు

సాధారణంగా నొప్పులను లైట్ తీసుకుంటాం. కానీ తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, మెడనొప్పి, కండరాలు బిగుతుగా మారడం కూడా మానసిక ఒత్తిడి ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు. 

Image credits: Getty

ఆసక్తి తగ్గడం

మానసిక ఒత్తిడితో బాధపడేవారిలో ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. పనులపై శ్రద్ధ తగ్గుతుంది, ఏ పని చేయడానికి ఇష్టపడరు. అలాగే కూర్చుండిపోతారు. 
 

Image credits: Getty

ఛాతీలో నొప్పి

ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారిలో ఛాతిలో నొప్పి, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోకూడదు. 

Image credits: Getty

అలాంటివి తినాలిపించడం

మానసిక ఒత్తిడి ఉన్న వారి ఆహారపు అలవాట్లు కూడా మారుతుంటాయి. ముఖ్యంగా స్వీట్లు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ తినాలనిపిస్తుంటుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. 
 

Image credits: Freepik

కోపం

అకారణంగా కోపం రావడం. చిన్న చిన్న విషయాలను మర్చిపోతుండడం, ఆందోళన కలుగుతుండడం వంటి లక్షణాలు కూడా మానసిక ఒత్తిడికి సంకేతంగా భావించాలి. 
 

Image credits: Freepik

నిత్యం అలసట

హైపర్‌ టెన్షన్‌, ఒత్తిడితో బాధపడేవారిలో తీవ్ర అలసట, నిస్సత్తువ కనిపిస్తుంది. అలాగే తరచూ నోరు పొడిబారుతున్నా అది మానసిక ఒత్తిడికి సంకేతంగా భావించాలి. 

Image credits: Freepik

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

Image credits: our own

మటన్ రోజూ తింటే ఏమౌతుంది?

ఉల్లిపాయలు త్వరగా పాడవుతున్నాయా? ఇలా చేస్తే నెల రోజులైనా..

మంగళవారం నాడు నాన్ వెజ్ ఎందుకు తినరు

పిల్లలు తొందరగా నేర్చుకునే చెడు అలవాట్లు ఇవే