Lifestyle

జీవితం 'లో' ఫీలవుతున్నారా.? వివేకానంద సూక్తులు చదవాల్సిందే

Image credits: X

అదే ముఖ్యం

నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. 
 

Image credits: Swami Vivekananda

ఓర్పుతోనే విజయం

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఓర్పు ఎంత ముఖ్యమైందో ఈ సూక్తి చెబుతోంది. 
 

Image credits: Pinterest

అదే పెద్ద బలహీనత

తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకనే గొప్ప సందేశం ఇందులో ఉంది. 
 

Image credits: Pinterest

ఒక్క రోజులో సాధించలేం

పట్టువదలకుండా చేసే ప్రయత్నం కచ్చితంగా విజయాన్ని అందిస్తుంది. ఒక్క రోజులోనే దేన్నీ సాధించలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
 

Image credits: Pinterest

కెరటమే ఆదర్శం

కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా రెట్టించినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాలన్న అర్థం ఇందులో ఉంది. 
 

Image credits: Pinterest

సుఖంగా ఉండాలంటే

మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. నీ సంతోషం ఇతరుల సంతోషంపై ఆధారపడి ఉంటుందన్న సూక్తి ఇందులో ఉంది. 
 

Image credits: freepik

వాటిని విస్మరించండి

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచననూ విస్మరించండి.

Image credits: Wikipedia

గుడ్డు పెంకులతో ఈ లాభాలున్నాయా? తెలిస్తే అస్సలు పడెయ్యరు..

WWEలో టాప్ 5 అందమైన రెజ్లర్లు వీరే

రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలా?

అనాథాశ్రమం స్థలంలో అంబానీ ఇల్లు !