Lifestyle
క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు.
క్యారట్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్కపోటును అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీపీతో బాధపడేవారికి ఎంతో మంచిది.
మంచిదని క్యారెట్‌ను అధికంగా తీసుకుంటే కొన్ని రాకల సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ క్యారెట్ వల్ల కలిగే ఆ నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్‌లను అతిగా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
క్యారెట్‌లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రలేమికి దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా క్యారెట్ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చర్మ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు క్యారెట్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. ఇందులోని న్యాచురల్ షుగర్ రక్తంలో చక్కెర పెరగడానికి కారణమవుతుండొచ్చు.
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.