Lifestyle

ఉల్లిపాయలు త్వరగా పాడవుతున్నాయా? ఇలా చేస్తే నెల రోజులైనా..

Image credits: Freepik

నిల్వ చేసే విధానం

సాధారణంగా ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా లేకపోతనే త్వరగా పాడవుతుంటాయి. అందుకే కొన్ని పద్ధతులు పాటించాలి. 
 

Image credits: Freepik

కొనే ముందే

ఉల్లిపాయలను కొనుగోలు చేసే ముందే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. దెబ్బలు తగిలిన, రంగు మారిన ఉల్లి పాయలను కొనుగోలు చేయకూడదు. ఇవి త్వరగా పాడవుతాయి. 
 

Image credits: Getty

నొక్కి చూడడం

ఉల్లిపాయలను కొనుగోలు చేసే ముందు రెండు వైపులా వాటిని చేతితో నొక్కాలి. ఒకవేళ చేతికి మెత్తగా ఉన్నట్లు భావన కలిగితే అలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు. 
 

Image credits: freepik

పగుళ్లు

పగుళ్లు ఉన్న ఉల్లిపాయలను కూడా కొనుగోలు చేయకూడదు. ఇవి ఎంత జాగ్రత్తగా నిల్వచేసినా ఎక్కువ కాలం నిల్వ ఉండవు. 
 

Image credits: social media

కవర్‌లో పెట్టకూడదు

ఉల్లి పాయలను నిల్వ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కవర్‌లో పెట్టకూడదు. గాలి తగిలే స్థలంలో నేలపై ఒక కవర్‌ వేసి పెడితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: social media

నీటి తడి

గోడలకు నీటి తడి వచ్చే ప్రదేశాల్లో ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. 

Image credits: Getty

వీటికి దూరంగా

చాలా మంది ఉల్లిపాయలను, బంగాళ దుంపలను ఒకే చోట నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఉల్లి పాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

Image credits: freepik

మంగళవారం నాడు నాన్ వెజ్ ఎందుకు తినరు

పిల్లలు తొందరగా నేర్చుకునే చెడు అలవాట్లు ఇవే

విదుర నీతి: మురికి బట్టలు అందమైన స్త్రీలను ఎలా రక్షిస్తాయి?

చాణ‌క్య నీతి: ప్రేమ‌, పెళ్లి.. ఈ 6 విష‌యాలు తెలుసుకోవాల్సిందే