రెడ్ వైన్ తాగితే తలనొప్పి ఎందుకు వస్తుందన్న దానిపై ఇటీవల పరిశోధనలు నిర్వహించగా. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెడ్ వైన్ పై పరిశోధన
రెడ్ వైన్‌లోని సల్ఫైట్స్, బయోజెనిక్ అమైన్స్, టానిన్లు తలనొప్పికి కారణమవుతాయని భావిస్తున్నారు. అయితే కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనల్లో వేరే విషయం వెల్లడైంది.
మెటబాలిక్ దశలో జాప్యం
ద్రాక్ష తొక్క, గింజల్లో ఉండే ఫెనోలిక్ సమ్మేళనాలు వైన్ తయారీకి ఉపయోగపడతాయి. వైన్ తాగిన తర్వాత జీర్ణ ప్రక్రియలో మెటబాలిక్ దశలో జాప్యం ఏర్పడుతుంది ఇది తలనొప్పికి దారి తీస్తుంది.
అసిటాల్డిహైడ్ ప్రమాదకరం
ఆల్కహాల్ జీర్ణక్రియలో విషపూరిత అసిటాల్డిహైడ్ ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో వాపు, తలనొప్పికి కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
మైగ్రేన్ ఉంటే
తరచుగా తలనొప్పితో బాధపడేవారు రెడ్ వైన్‌కు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు రెడ్ వైన్ జోలికి వెళ్లకూడదు.
వైట్ వైన్ సురక్షితం
అయితే వైట్ వైన్ తాగితే తలనొప్పి రాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. రెడ్ వైన్ తో ఇబ్సబందులు వచ్చే వారు వైట్ వైన్ ను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని చెబుతున్నారు.