Lifestyle

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Image credits: Our own

ఏడాదిలోపు

కొత్తగా పెళ్లైన జంట ఎలాంటి కంట్రోల్ టిప్స్‌ పాటించకపోయినా గర్భం దాల్చకపోతే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు. 


 

Image credits: freepik

ఆ ఆతృత వద్దు

చాలా మంది జంటలు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే కన్జీవ్‌ అవ్వాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇది ఒత్తిడికి దారి తీస్తుందని చెబుతున్నారు. 

Image credits: social media

ఇతరులతో పోల్చుకోవడం

వేరే జంటలతో పోల్చుకోవడం కూడా మానేయాలి. వారికి, మాకు ఒకేసారి వివాహమైంది. వారు మాకంటే ముందే పేరెంట్స్‌ కాబోతున్నారన్న టెన్షన్‌ పడకండి. ఈ ఒత్తిడి ఇబ్బందులకు దారి తీస్తుంది. 
 

Image credits: social media

ఫిక్స్‌డ్‌ టైమ్‌

ఇదే సమయంలో గర్భం దాల్చాలి, సరిగ్గా ఇదే నెలలో కన్జీవ్‌ అవ్వాలనే ఆలోచనను మానుకోండి. దీనివల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 
 

Image credits: freepik

ప్లాన్‌ చేసే ముందు

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే ముందు మహిళలు కచ్చితంగా ఫోలిక్‌ యాసిడ్ సప్లిమెంటరీలను తీసుకోవాలి. దీనివల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే గర్భం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: freepik

చెడు అలవాట్లు

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసే కనీసం 6 నెలల ముందు నుంచే చెడు అలవాట్లను పూర్తిగా మానేయాలి. పురుషులు ఆల్కహాల్‌, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
 

Image credits: freepik

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చాణక్య నీతి: అందమైన భార్య వారికి ఎందుకు విషంలాంటిది?

రసం తాగితే ఏమౌతుందో తెలుసా

అసిడిటీ ఉన్న వారు.. ఇవి అస్సలు తినకూడదు

చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సినవి ఇవే