Lifestyle
ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గడ్డం తెల్లగా మారేది. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.
తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గడమే. ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత వంటి కారణాలతో జుట్టు తెల్లబడుతోంది.
తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి మార్కెట్లో లభించే కలర్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ తెల్ల గడ్డానికి నేచురల్ మార్గాల్లో కూడా చెక్ పెట్టొచ్చు
ఇందుకోసం కొన్ని బంగాళదుంపలను తీసుకొని వాటి పొట్టును తీయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి బంగాళదుంప తొక్కలను వేసి మరిగించాలి.
అనంతరం ఈ నీటిలో అలోవెర గుజ్జును వేసి బాగా మరిగించాలి. ఇలా చేస్తే మెత్తగా మారుతుంది. ఆ తర్వాత బంగాళదుంప తొక్కలను వేరు చేసి ఆ మిశ్రమాన్ని డబ్బాలోకి తీసుకోవాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని గడ్డానికి బాగా అప్లై చేసుకొని ఆరిన తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే గడ్డం తెల్లబడకుండా ఉంటుంది.
జుట్ట తెల్లబడకూడదంటే తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. కరివేపాకు, నల్ల నువ్వులను రెగ్యులర్‌గా తీసుకుంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.