Lifestyle

ఏపీలో ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే..

Image credits: Google

తిరుమల, తిరుపతి

తిరుపతి అనగానే ఆధ్యాత్మికభావన కలగడం ఖాయం. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కచ్చితంగా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటి. 
 

Image credits: Twitter

అరకు వ్యాలీ

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అరకు వ్యాలీని ఒక్కసారైనా చూడాల్సిందే. ఇక్కడి పచ్చటి పర్వత ప్రాంతాలు, కాఫీ తోటలు పర్యాటకులను కట్టి పడేస్తాయి

Image credits: Pinterest

విశాఖపట్నం

ఏపీలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో విశాఖపట్నం ఒకటి. ఇక్కడి ఆర్కే బీచ్‌, రుషికొండ బీచ్‌, కైలాసగిరి, సబ్‌మెరైన్ మ్యూజియం, సింహాచలం కచ్చితంగా చూడాల్సిందే. 
 

Image credits: SocialMedia

గండికోట

కడప జిల్లాలో ఉన్న గండికోట కూడా కచ్చితంగా చూడాల్సిందే ప్రదేశాల్లో ఒకటి. భారత్‌ గ్రాండ్ కేనియన్‌గా పేరుగాంచిన ఈ ప్రదేశాన్ని కచ్చితంగా వీక్షించాల్సిందే. 
 

Image credits: SocialMedia

పుట్టపర్తి

శ్రీ సత్యసాయి బాబా జన్మస్థలం అయిన పుట్టపర్తిని కచ్చితంగా వీక్షించాల్సిందే. ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచి ఇక్కడి ప్రశాంతి నిలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 

Image credits: Google

విజయవాడ

విజయవాడ కనకదుర్గ దేవీని దర్శించుకునేందుకు ఏటా దేశ నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కృష్ణమ్మ పరవళ్లు, విజయవాడ చుట్టూ పక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను వీక్షించాల్సిందే. 
 

Image credits: Wiki

కోనసీమ

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన కోనసీమను కూడా ఒక్కసారైనా వీక్షించాల్సిందే. ఇక్కడి పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్‌ వాటర్‌, హౌజ్‌ బోట్‌ మంచి అనుభూతిని ఇస్తాయి. 
 

Image credits: Pinterest

శ్రీశైలం

ఏపీలో సందర్శించిన మరో మంచి ప్రదేశాల్లో శ్రీశైలం ఒకటి. నల్లమల అడవులలో కొండల మధ్య కొలువై ఉన్న శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించడం మరిచిపోలేని ఒక అనుభూతి. 
 

Image credits: Wiki

మీ భర్త ఈ తప్పులు చేస్తున్నాడా? అస్సలు సర్దుకు పోకండి..

షుగర్‌ పేషెంట్స్‌ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా?

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి

చాణక్య నీతి: అందమైన భార్య వారికి ఎందుకు విషంలాంటిది?