Lifestyle

ప్రపంచంలో గూడు కట్టుకునే ఏకైక పాము.. ఎన్నో విశేషాలు.

కింగ్ ఆఫ్ స్నేక్స్..

ప్రపంచంలో రకరకాల పాములు కనిపిస్తాయి - విషపూరితమైనవి, విషరహితమైనవి, గాల్లోకి ఎగిరేవి. ఇలా రకరకాల పాములు ఉంటాయి. అయితే కింగ్ ఆఫ్ స్నేక్స్ గా పిలిచే పాము ఒకటి ఉందని మీకు తెలుసా.? 

విషపూరితమైన, తెలివైన సర్పం

ఈ పాము కేవలం విషపూరితమైందే కాదు, తెలివైనది కూడా. ఈ పాము ఎంత మందిలో ఉన్న తన సంరకకుడిని ఇట్టే గుర్తు పడుతుంది. ఇంతకీ ఆ పాము మరెదో కాదు కింగ్ కోబ్రా. 

కింగ్ కోబ్రా..

కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. అలాగే ఈ పామును ఇతర పాముల కంటే తెలివైందిగా చెబుతారు. ఈ పాము వేటాడే పద్ధతులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. 

తెలివైన కింగ్ కోబ్రా

ఇతర పాముల్లో లేని ఎన్నో ప్రత్యేక గుణాలు ఈ పాములో ఉంటాయి. వేటాడే సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటాయి. అలాగే తన సంరక్షకుడు ఎంత మందిలో ఉన్నినా ఇట్టే గుర్తిస్తుంది. 

తన ప్రాంతాన్ని గుర్తించగలదు

ఇక మగ కింగ్ కోబ్రాలు అడవిలో త ప్రాంతాన్ని బాగా గుర్తు పెట్టుకుంటాయి. తమ సరిహద్దుల్లోకి ఇతర పాములను అస్సలు రానివ్వవు. 

గూడు కట్టే ఏకైక పాము

ఇక ఆడ కింగ్ కోబ్రా గుడ్డు పెట్టడానికి గూడు కడుతుంది. ఆకులు, కొమ్మలు, ఇతర వస్తువులను సేకరించి గూడును తయారు చేసుకుంటుంది. ప్రపంచంలో గూడు నిర్మించుకునే ఏకైక పాము ఇదే. 

18 అడుగుల పొడవు వరకు

కింగ్ కోబ్రా మరో ప్రత్యేకత ఇది ఏకంగా 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అలాగే ఈ పాము జీవిత కాలం 20 ఏళ్లు ఉంటుంది. 

చాలా ప్రమాదం..

కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైందిగా చెబుతారు. ఈ పాము విషయం ఒక న్యూరోటాక్సిక్ ఇది మానవ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 

ప్రాణాంతక విషం

ఒకవేళ కింగ్ కోబ్రా కాటు వేస్తే తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. పక్షవాతం, కోమాలోకి కూడా వెళ్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. 

ఎక్కడ ఉంటాయి.?

కింగ్ కోబ్రాలు ఎక్కువగా భారతదేశం, చైనా, ఇండోనేషియా, మలేషియా,  ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. చెరువులు, నదుల, దట్టమైన అడవుల్లో ఎక్కువగా నివసిస్తుంటాయి. 

రూ. 22 కోట్ల కారు ! అంబానీ, అదానీ కాదు, ఎవరికి వుందో తెలుసా?

మకర సంక్రాంతి నాడు ఈ 5 పనులు అస్సలు చేయకండి !

కోపంలో ఉన్న భార్యను ఎలా కూల్ చేయాలో తెలుసా?

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?