Lifestyle

రోజూ ఒక జామ కాయ తినండి చాలు..

Image credits: Freepik

పుష్కలమైన విటమిన్‌ సి

సాధారణంగా విటమిన్‌ సి అనగానే నారిజం అనుకుంటాం. కానీ జామలో కూడా పుష్కలమైన విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

తియ్యగా ఉన్నా

డయాబెటిస్‌ పేషెంట్స్‌ జామ కాయ తినడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ జామలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా జామ కాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 
 

Image credits: Getty

ఫైబర్‌తో

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ కచ్చితంగా జామకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. 
 

Image credits: Getty

జీర్ణ సమస్యలకు

జామలో ఉండే డైటరీ ఫైబర్‌ కంటెంట్ కడుపును శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

Image credits: Freepik

క్యాన్సర్‌కు చెక్‌

జామలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఔషధగుణాలు శరీరంలో క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో ఉపయోగపడుతుందని. పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

Image credits: iSTOCK

మెరుగైన కంటి చూపు

జామ కాయలో విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కేటరాక్ట్‌ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో జామ కాయ ఉపయోగపడుతుంది

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌ చిట్కాలు..

ఈ విషయాల్లో సిగ్గు పడుతున్నారా? మీరు జీవితంలో ఎదగరు

పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి

నల్లగా ఉన్నాయని లైట్‌ తీసుకోకండి.