Lifestyle
సొరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
సొరకాయలో పుష్కలమైన నీరు ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
సొరకాయను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా కచ్చితంగా సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సొరకాయలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఇందులో మెగ్నీషియం కండరాలను బలోపేతం చేస్తుంది.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సొరకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని వాటర్ కంటెంట్ కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూస్తుంది.
పచ్చి సొరకాయను తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడంతో పాటు, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.