Lifestyle
అల్లం వాటర్ మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం వేడి నీళ్లలో చిన్న అల్లం ముక్కను వేసి మరిగించండి. దీన్ని ఉదయం పరిగడుపున తాగండి.
అల్లం టీ కూడా బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అల్లం టీని తాగడం అలవాటు చేసుకోండి.
నిమ్మరసంలో అల్లాన్ని కలిపి తాగితే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇది మీ ఆకలిని తగ్గించి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అల్లం జ్యూస్ తాగినా మీరు బరువు తగ్గుతారు. ఇందుకోసం అల్లం, నిమ్మ, తేనె, నీళ్లు కలిపి అల్లం జ్యూస్ ను తాయరుచేయండి. దీన్ని తాగితే మీరు హెల్తీగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గడానికి అల్లం, వెనిగర్ బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఈ రెండింటిని కలిపి తాగాలి. ఇది తాగితే మీకు ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
నిజానికి గ్రీన్ టీ ఒక్కటి తాగినా బరువు తగ్గుతారు. ఇలాంటి దానిలో అల్లం టీ కలిపి తాగితే ఇంకా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇందుకోసం అల్లం టీలో గ్రీన్ టీని సమానంగా కలిపి తాగాలి.
ఏదేమైనా ఏదైనా ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలి.