Lifestyle
కర్నూలు జిల్లాలోని గోకవరంలోని ఓ పేద కుటుంబంలో జన్మించారు పుల్లారెడ్డి. 5వ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువును మానేశారు.
చదువు అబ్బకపోవడంతో కర్నూలులోని తన బాబాయ్ కసిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర జీతానికి ఉంచారు. ఆ సమయంలోనే పుల్లరెడ్డి వివాహం జరిగింది.
జీతం పెంచకపోవడంతో పని నుంచి బయటకు వచ్చిన పుల్లారెడ్డి కర్నూలులో సొంతంగా టీ కొట్టు పెట్టుకున్నాడు. రూ. 25 అప్పుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు.
టీ కొట్టుతో పాటు ఎండకాలంలో మజ్జిగను అమ్మాడు. ఆ తర్వాత భుజాన దుస్తులు పెట్టుకొని విక్రయించాడు. అలా వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు
స్నేహితుడితో కలిసి దుస్తుల వ్యాపారం ప్రారంభించిన పుల్లారెడ్డి అందులో సక్సెస్ కాలేకపోయాడు. పాట్నర్ మోసం చేయడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడు.
అయితే నష్టానికి భయపడని పుల్లారెడ్డి ఆ తర్వాత రూ. 1000 అప్పు చేసి మిఠాయిల దుకాణం ప్రారంభించాడు. 1948లో మొదలైన పుల్లారెడ్డి ప్రస్థానం కోట్ల వ్యాపారానికి చేరింది.
ఇక 1957లో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో స్వీట్ హౌజ్‌ను ప్రారంభించారు. అనంతరం రెండు రాష్ట్రాల్లో ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేస్తూ వచ్చారు.
కేవలం స్వీట్ షాప్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. సంపాదించిన దాంట్లో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు.
జీవితం చివరి వరకు కష్టపడి పనిచేసి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన పుల్లారెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శమని చెప్పడంలో సందేహం లేదు.