Lifestyle

పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలి?

Image credits: others

రాళ్లు లేకుండా

సాధారణంగా పాములు ఎక్కువగా బండరాళ్ల సందుల్లో తలదాచుకుంటాయి. కాబట్టి ఇంటి చుట్టు పక్కల ప్రదేశాల్లో రాళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. 
 

Image credits: our own

డ్రైనేజీ పైపులు

పాములు ఇంట్లోకి ప్రవేశించే మరో మార్గం డ్రైనేజీ పైపుల ద్వారా. అందుకే డ్రైనేజీలోకి వదిలే పైప్‌కు జాలీ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. 
 

Image credits: social media

పాత వస్తువులు

మనలో చాలా మంది మెట్ల కింద ఖాళీ ఉంటుందని పాత వస్తువులను పెడుతుంటారు. అయితే ఇవి పాములకు మంచి ఆశ్రయంలాగా మారుతాయని గుర్తుపెట్టుకోవాలి. 
 

Image credits: social media

కొన్ని రకాల మొక్కలు

కలబంద, బంతిపూల వంటి వాసన పాములకు నచ్చవు. ఇంటి ప్రాంగణంలో ఇలాంటి మొక్కలను పెంచుకోవడం ద్వారా పాములు దరిచేరకుండా ఉంటాయి. 

Image credits: Pinterest

ఎలుకలు లేకుండా

ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎలుకలు లేకుండా జాగ్రత్త పడాలి. 
 

Image credits: social media

పెంపుడు కుక్కలు

పాముల అలికిడిని గుర్తించడంలో కుక్కలు బాగా చురుకుగా ఉంటాయి. అందుకే ఇంటి ప్రాంగణంలో పెంపుడు కుక్కలను పెంచుకుంటే పాములను తరిమికొడతాయి. 
 

Image credits: Getty

కొన్ని రకాల ఉత్పత్తులు

పాములను తరమికొట్టే రసాయనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఇంటి చుట్టూ చల్లితే పాములు ఆ దరిదాపుల్లోకూడా కూడా రావు. 

Image credits: iSTOCK

అందంగా కనిపించాలా? విటమిన్‌ E ఉండే ఈ ఫుడ్‌ తినాల్సిందే

చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే

పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్