Lifestyle

డ్రెస్సులపై ఇంకు మరకలను ఎలా పోగొట్టాలో తెలుసా

Image credits: instagram

ఇంకు మరకలు పోవడానికి చిట్కాలు

దుస్తులపై పడిన ఇంకు మరకలను సులువుగా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పాలు

అవును పాలతో ఇంకు మరకలను పోగొట్టొచ్చు. పాలలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ఇంకు మరకలను పోగొడుతాయి. ఇందుకోసం ఇంకు మరక అంటిన దాన్ని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం సబ్బుతో ఉతకాలి. 

ఆల్కహాల్

ఇంకు మరక చిన్నగా ఉంటే మందులో కొంచెం దూదిని ముంచి మరకపై రుద్దండి. మరక పెద్దగా ఉంటే 15 నిమిషాల పాటు మందులో నానబెట్టి ఉతకండి. 

షేవింగ్ క్రీమ్

షేవింగ్ క్రీమ్‌ తో కూడా ఇంక మరకలను పోగొట్టొచ్చు. ఇందుకోసం షేవింగ్ క్రీమ్‌ని మరకకు రుద్ది 15 నిమిషాల తర్వాత సబ్బుతో ఉతకండి. 

Image credits: సోషల్ మీడియా

ఉప్పు, నిమ్మరసం

ఉప్పు, నిమ్మరసంతో ఇంకు మరకలు ఈజీగా పోతాయి. ఇందుకోసం నిమ్మరసంలో ఉప్పు కలిపి టూత్ బ్రష్ తో ఇంకు మరకకు రుద్దండి. బ్రష్‌తో రుద్దితే మరకలు వెంటనే పోతాయి. 

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్‌లో ఉండే ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఇంకు మరకలను తొందరగా పోగొడతాయి. ఇందుకోసం ఇంకు మరకకు టూత్ పేస్ట్‌ను పెట్టి పూర్తిగా ఆరిన తర్వాత సబ్బుతో రెండు సార్లు ఉతకండి. 

Find Next One