Lifestyle
ఉన్నపలంగా బరువు తగ్గుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. అకారణంగా బరువు తగ్గడం అన్నవాహిక, క్యాన్సర్, ఊపిరిత్తుల, కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతంగా భావించాలి.
దగ్గు సాధారణమే అయినా.. 3 వారాలకు మించి దగ్గు తగ్గకుండా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
ఏ పని చేయకపోయినా తీవ్ర అలసట ఉంటే కూడా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా క్యాన్సర్‌కు సంకేతంగా చెబుతున్నారు.
రొమ్ము, చంకల్లో గడ్డలు ఏర్పడడం. రొమ్ము ఆకృతిలో ఊహించని మార్పు కనిపించడం, చనుమొనల నుంచి ఇతర ద్రవాలు రావడం బ్రెస్ట్ క్యాన్సర్‌కు లక్షణాలుగా చెప్పొచ్చు.
జ్వరం సాధారణమే అయినా. దీర్ఘకాలంగా జ్వరం వస్తుంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. పదే పదే జ్వరం రావడం క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలని అంటున్నారు.
తరచూగా మలబద్ధకం, తీసుకున్న ఆహారం జీర్ణంకాకపోవడం, మలంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తే. పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
చర్మంపై అకారణంగా దురద రావడం, మచ్చలు ఏర్పడడం. స్పర్శలేని పులిపిర్లు వంటివి కనిపించడం చర్మ క్యాన్సర్ ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.