బరువు తగ్గాలని చాలా మంది కోరుకుంటారు. వర్కవుట్స్, వాకింగ్ చేస్తుంటారు. అయితే వీటితో పాటు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Image credits: Getty
షుగర్ డ్రింక్స్
బరువు తగ్గాలనుకునే వారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్స్ లో ఎక్కువగా ఉండే క్యాలరీలు బరువు పెరగడానికి దారి తీస్తుంది.
Image credits: Getty
ఎనర్జీ డ్రింక్స్
బరువు తగ్గే ప్లాన్ లో ఉన్న వారు ఎనర్జీ డ్రింక్స్ కి సైతం దూరంగా ఉండాలి. ముఖ్యంగా కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకుంటే బరువు పెరుగుతారు.
Image credits: Getty
కార్బొనేటెడ్ పానీయాలు
కూల్ డ్రింక్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి వీటికి దూరంగా ఉండాలి.
Image credits: Getty
ఫ్రూట్ జ్యూస్లు
పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసినా. షుగర్ కంటెంట్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియకు అడ్డంకి ఏర్పడుతుంది.
Image credits: Getty
మద్యం
బరువు తగ్గాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మద్యం తీసుకున్న సమయంలో తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది.
Image credits: Getty
నోట్
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.