Lifestyle
భర్తలు తమ భార్యలకు కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. వీటివల్ల ప్రశాంతతో పాటు బంధం బలంగా ఉంటుంది.
డబ్బులకు సంబంధించిన వివరాలను వీలైనంత వరకు భార్యలకు చెప్పకూడదని చాణక్యుడు తెలిపారు. ముఖ్యంగా అప్పుగా ఇచ్చినా, విరాళంగా ఇచ్చినా భార్యతో షేర్ చేసుకోకూడదు.
భార్యకు ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం గురించి చెప్ప కూడదని చాణక్య నీతిలో పేర్కొన్నారు. ఆదాయం వివరాలన్నీ భార్యకు తెలిస్తే అది వారి మధ్య దూరానికి కారణమవుతుందని చాణక్యుడు తెలిపారు.
జీవితంలో ఎదురైన అవమానాలకు సంబంధించిన వివరాలను కూడా భార్యలతో పంచుకోకూడదని చాణ్య తెలిపారు. ఇది వారిని మానసికంగా బలహీనంగా మార్చడమే కాకుండా, గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
భర్తలు తమ బలహీనలత గురించి కూడా భార్యలకు చెప్పకూడదు. తమకు తెలియకుండానే ఈ విషయాలను ఇతరులతో ప్రస్తావించే అవకాశం ఉంటుంది.
గతంలో మీ జీవితంలో తారసపడిన మహిళల గురించి భార్యలతో చెప్పకూడదు. ప్రస్తుతం మీలో ఎలాంటి వేరే ఆలోచనలు లేకపోయినా ఆ ప్రస్తావన మనస్పార్థాలకు దారి తీస్తుంది.