Lifestyle
చికెన్ 65, చికెన్ మంచురియా, చికెన్ లాలిపప్ ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. చాలా మంది ఫెవరేట్ ఫుడ్‌లో కూడా చికెన్ మొదటి స్థానంలో ఉంటుంది.
చికెన్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని త్వరగా అందిస్తాయి. ఇందులోని బీ6, బీ12 విటమిన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చికెన్‌ను మితంగా తీసుకుంటే జీవక్రియను మెరుగుపరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఐరన్, జింక్ ఇందుకు దోహదం చేస్తాయి.
అయితే కొందరు చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఆరోగ్యానికి అంతలా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో పోషకల విలువలు ఏమి ఉండవని చెబుతున్నారు.
కొంత మంది దుకాణదారులు కోళ్లు ఆకర్షణీయంగా కనిపించే ఉద్దేశంతో కోడి తోలుపై రసాయనాలు చల్లుతారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని పడేలా చేస్తుంది.
కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరుగుతుంది.
దీర్ఘకాలం కోడి స్కిన్‌ను తింటే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. స్కిన్‌తో వండిన చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.