Lifestyle

రాత్రి ఈ పండ్లను తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

Image credits: Freepik

కీరదోస

కీరదోసలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో రాత్రుళ్లు కీరను తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్‌ కంటెంట్‌ పెరుగుతుంది.  మూత్ర విసర్జనకు  దారి తీస్తుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. 
 

Image credits: Pixabay

అరటిపండు

రాత్రుళ్లు అరటి పండు తీసుకుంటే మంచిదని చాలా మంది భావిస్తారు. సాయంత్రం అరటి పండు తింటే మంచిదే కాదని రాత్రి తీసుకుంటే మాత్రం మెలటోనిన్ హార్మోన్‌ పెరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. 

Image credits: Getty

పుచ్చకాయ

వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. రాత్రుళ్లు పడుకునే ముందు పుచ్చకాయ తీసుకుంటే గ్యాస్‌, జీర్ణ సమస్యలతో పాటు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. 

Image credits: Getty

ద్రాక్ష

ద్రాక్ష పండ్లను కూడా రాత్రుళ్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. 

Image credits: Getty

సిట్రస్‌ పండ్లు

రాత్రుళ్లు సిట్రస్‌ జాతి పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే వీటిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎసిడిటీతో పాటు కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 

Image credits: Getty

మామిడిపండు

మామిడిపండ్లలో కూడా చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఈ పండ్లను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిద్ర సమస్య ఎక్కువ అవుతుంది.

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?

చాణక్య నీతి: వీటిని దూరం చేస్తేనే మీకు సక్సెస్ దక్కుతుంది

చాణక్య నీతి: ఈ 4 పనుల్లో ఎప్పుడూ తొందర పడొద్దు.. ఎందుకంటే?

చాణక్య నీతి.. మనుషులకు ఇవి ఎంతున్నా సరిపోవు.. ఇంకా కావాలనిపిస్తుంది