Lifestyle
పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అలియాస్ బాబా బాగేశ్వర్ గురించి దేశమంతా తెలుసు. ఆయనకు దివ్యశక్తులు ఉన్నాయని, భవిష్యత్తు చెప్పగలరని ప్రజలు నమ్ముతారు.
తన ప్రవచనాల ద్వారా బాబా బాగేశ్వర్ జీవితానికి ఉపయోగపడే చిట్కాలు కూడా చెబుతారు. వీటిని పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చని చాలా మంది నమ్మకం.
సమస్యలకు ప్రధాన కారణం కోపమని బాబా బాగేశ్వర్ చెప్పారు. కోపం వల్ల మీతో పాటు కుటుంబం, మన సమాజం హానికి గురవుతున్నదని చెప్పారు.
కోపంలో తప్పులు చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కోపం నుంచి దూరంగా ఉండటం మంచిది.
భార్య కోపిష్టి అయితే భర్త మౌనంగా ఉండటం మంచిది. దీంతో భార్య కూడా త్వరగా శాంతించిపోతుంది.
భార్యలాగే భర్త కూడా కోపిస్తే గొడవ పెద్దది అవుతుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆలోచిస్తే కోపం రాదు.
మీ భార్య కోపంతో ఉన్నప్పుడు మీరు కూడా ఆగ్రహానికి గురైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. మీరు కూల్ గా, కొద్ది సేపు సైలెంట్ గా ఉంటే కొద్దిపేపటికి భార్య కోపం కూడా తగ్గుతుందని చెప్పారు.