Lifestyle
పాత ప్లాస్టిక్ స్పూన్లకు ఇలా పసుపు రంగు వేసి మధ్యలో కాఫీ గింజలను అతికిస్తే.. అందమైన సన్ ఫ్లవర్ రడీ అవుతుంది. వీటిని గోడలకు హ్యాంగ్ చేస్తే ఇంట్లోకి వచ్చిన వారు ఫిదా అవ్వడం ఖాయం.
ఫొటోలో చూపించిన విధంగా పాత స్పూన్లతో తేనెటీగలను తయారు చేయొచ్చు. వీటికి రంగులు వేస్తే మరింత అందంగా. ఇలా చేసిన వాటికి గోడలకు అతికించుకుంటే చూడ్డానికి బాగా కనిపిస్తుంది.
ఫొటోలో కనిపిస్తున్న విధంగా దీపం పెట్టుకునే స్టాండ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వీటికి గోల్డ్ కలర్ వేస్తే దీపం వెలుతురులో జిగేల్ మంటుంది. చూపరులను ఆకట్టుకుంటుంది.
ఇలా ఫొటోలో చూపిన విధంగా మూడు, నాలుగు స్ఫూన్లను కలిపి పూలలాగా మార్చుసుకోవచ్చు. గాజు లేదా ప్లాస్టిక్ గ్లాసుల్లో ఏర్పాటు చేసుకొని ఫ్రిజ్ లపై అలంకరణగా పెట్టుకోవచ్చు.
నెమలి ఈకల్లాగా కూడా ప్లాస్టిక్ స్పూన్లను మార్చేయవచ్చు. ఖాళీ గోడపై నెమలి బొమ్మను గీసి వాటి ఈకల్లాగా స్పూన్లను అతికిస్తే చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది.
ఫొటోలో చూపించిన విధంగా నాలుగు స్పూన్లను తీసుకొని వాటి మధ్య స్పూన్ చివరి భాగాన్ని అతికిచ్చి.. ఇదిగో ఇలా అందమైన సీతాకొక చిలుకలను తయారు చేసి గోడలకు అతికించవచ్చు.
స్ఫూన్లతో ఇలా అందమైన బెడ్ లైట్ కూడా తయారు చేసుకోవవచ్చు. లైట్ చుట్టూ ఇలా పైనాపిల్ ఆకారంలో స్పూన్స్ ను అతికిస్తే అందమైన బెడ్ లైట్ రడీ అయినట్లే.