తప్పుడు పద్దతుల ద్వారా అంటే అధర్మంగా సంపాదించిన డబ్బు పదేండ్లు మాత్రమే ఉంటుంది. కానీ ఆ తర్వాత దాన్ని వడ్డీ, అసలుతో కలిపి మీరు చెల్లించాల్సి వస్తుంది.
అక్రమంగా ఎందుకు సంపాదించకూడదు
చాణక్య నీతి ప్రకారం.. అక్రమంగా, తప్పుడు పనుల ద్వారా మీరు సంపాదించిన మీకు ఎన్నటికీ మనశ్శాంతిని మాత్రం ఇవ్వదు. ధర్మంగా సంపాదించిన డబ్బే మీకు మనశ్శాంతిని ఇస్తుంది.
అక్రమ సంపాదన
చాణక్య నీతి ప్రకారం.. అక్రమంగా సంపాదించిన డబ్బు మీ నుంచి వెళ్లడమే కాకుండా.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మీతో ఉండదు. ఇదే మీ తప్పును మీరు గ్రహించేలా చేస్తుంది.
ఎలాంటి డబ్బు ప్రశాంతతను ఇస్తుంది?
ధర్మంగా, మంచి పనులు చేసి సంపాదించిన డబ్బే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు ఆనందాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. అందుకే తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించడం మానేయాలి.