Lifestyle

చాణక్య నీతి.. వీళ్లకు భార్యలు విషం కంటే డేంజర్

చాణక్య నీతి తెలుసుకోండి

చాణక్య నీతి ప్రకారం.. అందమైన భర్య విషంతో సమానం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఇది చాణక్య నీతి శ్లోకం

అనభ్యాసే విషం విద్య అజీర్ణే భోజనం విషమ్
విషం సభా దరిద్రస్య, వృద్ధస్య తరుణీ విషమ్
అర్థం- అభ్యాసం లేని జ్ఞానం, అజీర్తిగా ఉన్నప్పుడు భోజనం, పేదవాడికి సభ, వృద్ధుడికి యువతి విషం.

వృద్ధుడికి యువ భార్య ఎలా విషం?

వృద్ధులకు యంగ్ భార్య ఉండటం మంచిది కాదని చాణక్యుడు అంటాడు. వీళ్ల వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకే వృద్ధుడికి యంగ్ భార్య విషం లాంటిదంటారు.

అభ్యాసం లేని జ్ఞానం వ్యర్థం

మీకు పుష్కలంగా జ్ఞానముండి అభ్యసించకపోతే.. మీకు ఆ జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు. అందుకే చాణక్యుడు దీనిని కూడా విషంతో పోల్చాడు.

భోజనం ఎప్పుడు విషమవుతుంది?

చాణక్య నీతి ప్రకారం.. మీకు అజీర్తిగా ఉన్నప్పుడు కూడా రుచికోసం తిన్నారంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే తిన్నది అరగనప్పుడు ఏమీ తినకూడదంటారు. .

పేదవాడికి పెళ్లిళ్లు విషం

పేదవాడికి పెళ్లిళ్లు విషం లాంటివని చాణక్యుడు అంటాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో  అతనికి పెళ్లిళ్లకు వెళ్లడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

హలో జంట్స్.. టైట్ అండర్‌వేర్‌ ధరిస్తున్నారా? అయితే కష్టమే!

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లను మాత్రం ఇంటికి పిలవకూడదు

గర్భిణీలు నదుల వద్దకు వెళ్లొద్దని పెద్దలు ఎందుకు చెప్తారు? సైన్స్ కూడా