ఆచార్య చాణక్యుడు ఎన్నో రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఏకం చేసి అఖండ భారతాన్ని నిర్మించారు. ఈయన సూక్తులు నేటికీ మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఎవరికి భూలోకంలోనే స్వర్గం ఉంటుంది?
చాణక్య నీతిలో.. మన జీవితానికి ఎంతో ఉపయోగపడే ఎన్నో సూత్రాలున్నాయి.మరి ఎవరికి భూలోకమే స్వర్గంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాణక్య నీతి ప్రకారం
మంచి భార్యా, పిల్లలు, ధనం ఉన్నవారికి ఇహలోకమే స్వర్గమని ఆచార్య చాణక్యుడు అంటాడు.
పిల్లలు విధేయులుగా ఉండాలి
పిల్లలు విధేయులుగా ఉంటే.. తల్లిదండ్రులకు ఎలాంటి టెన్సన్ ఉండదు. అందుకే ఇలాంటి తల్లిదండ్రులకు భూలోకమే స్వర్గంగా మారుతుంది.
మంచి భార్య ఉండాలి
మంచి భార్య ఉన్న భర్త జీవితం కూడా సుఖంగా ఉంటుంది. భర్తను అర్థం చేసుకునే భార్య ఉంటే దాంపత్య జీవితం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా కలిపి పరిష్కరించుకుంటారు.
ధనం కూడా ముఖ్యమే
విధేయులైన పిల్లలు, భార్యతో పాటుగా ధనం కూడా ముఖ్యమేనంటాడు చాణక్యుడు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు ఉంటేనే గౌరవం లభిస్తుంది.