Lifestyle
చాణక్య నీతి ప్రకారం.. కొన్ని పనులను ఎప్పుడూ చేయడం వల్ల వయసు కంటే ముందే ముసలి వాళ్లు అవుతారు. ఇంతకీ ఏ పనులు చేస్తే తొందరగా ముసలి వాళ్లు అవుతారంటే?
చాణక్య నీతి ప్రకారం.. ఎప్పడూ ప్రయాణాలు చేస్తూ.. ఒక చోట ఉండనివారు తొందరగా ముసలి వాళ్లు అవుతారు. అంటే వళ్లు తమ యవ్వన శక్తిని తొందరగా కోల్పోతారు.
చాణక్య నీతి ప్రకారం.. సమయానికి శారీరక సుఖం లభించని వ్యక్తులు తమ కోరికలను మనసులో దాచుకుని చెడు అలవాట్లకు బానిసలవుతారు. దీనివల్ల వీరు సమయం కంటే ముందు ముసలివాళ్లు అవుతారు.
మనసుకు నచ్చింది ఏదీ చేయలేనివారు అంటే సామాజిక బంధాల్లో చిక్కుకున్న వారు తొందరగా ముసలి వాళ్లు అవుతారు. ఎందుకంటే వీళ్లకు కోరికలున్నా వాటిని నెరవేర్చులోని పరిస్థితి ఉంటుంది.
శారీరక సుఖాన్ని ఎక్కువగా అనుభవించే వ్యక్తులు తొందరగా యవ్వన శక్తిని కోల్పోతారు. దీనివల్ల మీరు వయసు కంటే ముందే ముసలివాళ్లు అవుతారు. అలాగే అనారోగ్యానికి గురవుతారు.
ఎప్పుడూ నెగిటీవ్ గా ఆలోచించే వారు ఇతరులను చూసి ఓర్వలేరు. అలాగే వారి ఆనందాన్ని చూసి బాధపడుతుంటారు. ఇలాంటి వారు కూడా తొందరగా ముసలివాళ్లు అవుతారు.