Lifestyle
ఆడబిడ్డ పుడితే తండ్రి ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తండ్రుల జీవిత కాలం 74 వారాలపాటు అంటే 6 ఏళ్లు పెంచుతుందని అంటున్నారు.
ఆడపిల్లలున్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పోలండ్‌లోని జాగిలోనియన్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. ఆడ పిల్లలున్న తండ్రులు లేవని వారితో పోల్చితే ఎక్కువ కాలం జీవిస్తారని వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వేల సంఖ్య తండ్రులపై విశ్లేషించిన డేటాను సేకరించారు. కొడుకులు ఉన్న తండ్రులను, కూతుళ్లు ఉన్నతండ్రుల మధ్య జీవితకాల వ్యత్యాన్ని స్పష్టంగా గుర్తించారు.
మరో అధ్యయనం ప్రకారం కుమార్తెలు, కుమారులు ఇద్దరూ ఒంటరి తల్లుల జీవిత కాలాన్ని పెంచుతున్నట్లు తెలిసింది. పిల్లలు లేని వారితో పోలిస్తే పిల్లలున్న వారు ఎక్కువ కాలం జీవించినట్లు తేలింది
కుమార్తెలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవించడానికి ఇష్టపడతారని, తండ్రికి ఎక్కువ మంది కుమార్తెలు ఉంటే, అతను ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం పలు వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి అందించడం జరిగింది. వీటిలో ఎంత వరకు శాస్త్రీయత ఉందన్న దానిపై స్పష్టత లేదని గమనించాలి.