Lifestyle
హైబీపీతో బాధపడేవారికి నల్ల కిస్మిస్‌లు దివ్యౌషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా డైట్‌లో భాగం చేసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
ప్రతీ రోజూ ఉదయం నల్ల కిస్మిస్‌లు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.
చలికాలంలో రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ కిస్మిస్‌లను ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి భవిష్యత్తులో కీళ్ల నొప్పులు రావొద్దనుకునే వారికి కిస్మిస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలోని పొటాషియం, కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్లాక్ కిస్మిస్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా నల్ల కిస్మిస్‌లు వరంలాంటివని చెప్పాలి. ఇందులోని ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఉపయోగపడుతుంది.
బ్లాక్ కిస్మిసలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే ఎక్కవ సేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.