Lifestyle
అరటి తొక్కల్లో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటితో దంతాలపై రుద్దితే వాటిపై ఉండు పసుపు మరకలు తొలగిపోయి తెల్లగా మారుతాయి.
అరటి తొక్కలతో బూట్లను పాలిష్ చేస్తే తళుక్కుమంటాయి. అరటి తొక్కలోనే లోపలి భాగంతో షూస్‌పై రుద్దాలి. ఆ తర్వాత ఒక స్మూత్ క్లాత్‌తో తుడిచేస్తే సరిపోతుంది.
అరటి తొక్క లోపలి భాగంతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం తళతళ మెరుస్తుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
అరటి తొక్క లోపలి భాగాన్ని గుజ్జుగా తీసి అందులో తేనె మిక్స్ చేయాలి. ఆ తర్వాత మిశ్రాన్ని ముఖానికి 8 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసి చల్లి నీటితో కడుక్కుంటే చాలు.
అరటి పండు తొక్కతో కళ్ల కింద వాపు తగ్గుతుంది. తొక్కను చిన్న ముక్కలుగా చేసి వాటిని కంటి కింద 15 నిమిషాలు ఉంచాలి. అనంతరం తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
అరటిపండు తొక్కలో హిస్టామిన్, విటమిన్లు సి, ఇ, లెక్టిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే మొటిమలను, మచ్చలను దూరం చేయడంలో సహాయపడుతాయి.
అరటి తొక్కలను తిన్నా కూడా మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో దోహదపడుతుంది
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.