Lifestyle
ఆప్రికాట్‌లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రేచీకటి వంటి సమస్యలు దరిచేరవు.
ఈ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుందీ పండు.
షుగర్‌తో బాధపడేవారు ఆప్రికాట్ పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయడపతాయి.
ఆప్రికాట్ ప్రూట్ లేదా డ్రై ఫ్రూట్ తీసుకున్నా చర్మ ఆరోగ్యం మెరుగువుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతింతంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆప్రికాట్ ఫ్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఆప్రికాట్ పండల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతుంది. దీంతో రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు.
మలబద్ధకంతో బాధపడేవారు కచ్చితంగా ఈ పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలద్ధకాన్ని దూరం చేస్తుంది.
పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.