Lifestyle
ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్‌గా చెప్పుకునే వివాహం విషయంలో, మరీ ముఖ్యంగా మహిళలకు ఎన్నో భయాలు ఉంటాయి.
కొత్తగా అత్తారింటిలోకి అడుగు పెట్టిన మహిళలకు ఎన్నో రకాల ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఎలా ఉండాలి.? ఏం చేయాలన్న సందేహాలు రావడం సర్వసాధారణం.
అయితే మారిన టెక్నాలజీతో పాటు పెళ్లి తర్వాత ఎలా ఉండాలన్న విషయానికి సంబంధించి కూడా మహిళలు గూగుల్‌పైనే ఆధార పడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కొత్తగా పెళ్లైన మహిళలు తమకు వచ్చిన సందేహాలను గూగుల్‌లో నివృత్తి చేసుకుంటున్నారని ఇటీవల నిర్వహించి అధ్యయనంలో వెల్లడైంది. వీటిలో కొన్ని ప్రధానమైనవి ఇవే.
మహిళలు గూగుల్‌లో ఎక్కువగా భర్తలు భార్యల నుంచి ఏం ఆశస్తారు. భర్త మనసును గెలుచుకోవాలంటే ఏం చేయాలి లాంటి విషయాలను సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.
పెళ్లి అయిన తర్వాత తమ భర్తలను ఎలా సంతోషంగా ఉంచాలి? భార్యలు ఎలా ఉంటే భర్తలు సంతోషంగా ఉంటారన్న విషయాలను కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటా.
పిల్లలను కనే విషయానికి సంబంధించిన వివరాలను కూడా గూగుల్‌లో వెతుకుతున్నారు. బిడ్డ పుట్టడానికి సరైన సమయం ఏంటన్న ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.