Lifestyle
మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని అలవాట్లు మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం మెదడును దెబ్బతీస్తుంది. పనిలో పడి అలాగే కూర్చోకూడదు. కనీసం ప్రతీ గంటకు ఒకసారి లేచి అటు, ఇటు నడవడం అలవాటు చేసుకోవాలి.
మెదడు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే మరో సమస్య నిద్రలేమి. తగినంత నిద్ర లేకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాల్సిందే.
గంటల తరబడి ఫోన్ లతో కుస్తీ పడితే కూడా మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బిజీ లైఫ్ లో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేస్తున్నారు.ఇది కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. కచ్చితంగా ఉదయం మంచి పోషకాలతో కూడిన టిఫిన్ తీసుకోవాలని చెబుతున్నారు.
శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడు పనితీరు దెబ్బతింటుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు రోజూ తాగాలి.
చెవులకు హెడ్ సెట్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం కూడా మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకు హెడ్ సెట్స్ కు దూరంగా ఉండడమే ఉత్తమం.
ఇటీవల జంక్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చక్కెర, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.