Lifestyle
ఇందుకోసం గుడ్డు పెంకులను నీటితో శుభ్రంగా కడిగి, ఆరబెట్టి పొడి చేయండి. ఆ పొడిని మొక్కల మట్టిలో కలాపి. వీటిలో కాల్షియం, ఇతర మినరల్స్మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
గడ్డు పెంకులను పొడిగా చేసి ఆ పొడిని టూత్ పేస్ట్ లో కలిపి బ్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే పళ్లు తెల్లగా మారుతాయి. కాల్షియం దంతాలను దృఢంగా మారుస్తాయి.
గాయాలాను మాన్పించడానికి కూడా గుండు పెంకులు ఉపయోగపడతాయి. గుడ్డు పెంకు లోపలి పొరను గాయాలపై ఉంచితే త్వరగా మానడానికి ఉపయోగపడతాయి.
గుడ్డు పెంకులతో చేసిన పొడిని పాత్రలు, సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. పెంకుల పొడిని, సబ్బు లేదా డిటర్జెంట్ లో కలిపి శుభ్రం చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.
గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి పొడి చేసి, తేనె లేదా అలోవెరాతో కలిపి చర్మంపై స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.