Lifestyle

వేడి నీటితో స్నానం చేస్తే పిల్లలు పుట్టరా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే

పురుషుల సంతానోత్పత్తి ఎలా దెబ్బతింటుంది

పురుషుల్లో సంతానోత్పత్తి దెబ్బతినడానికి మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 అంశాలు సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. 

టైట్ లోదుస్తులు ధరించడం

బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే సంతాన సమస్యలు వస్తాయి. టైట్ దుస్తులను ధరిస్తే వృషణాల చుట్టూ వేడి పెరుగుతుంది. ఇది శుక్రకణాల ఉత్పత్తి, నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

స్మోకింగ్

పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపే వాటిలో స్మోకింగ్ ప్రధానమైంది. సిగరెట్ తాగడం వల్ల సంతానోత్పత్తిపై చెడు ప్రభావం పడుతుంది. నికోటిన్ శుక్రకణాలను దెబ్బ తీస్తుంది. 

ఆల్కహాల్ సేవించడం

ఆల్కహాల్ కూడా శుక్రకణాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మద్యం పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శుక్రకణాల సంఖ్య, చలనశీలత తగ్గుతుంది. 

వేడి నీటితో స్నానం చేస్తే..

ఎక్కువ వేడి నీటితో స్నానం చేసినా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి కారణంగా శుక్రకణాల నాణ్యత దెబ్బ తింటుంది. 

చెడు ఆహారపు అలవాట్లు

తీసుకునే ఆహారం కూడా  సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

అనుష్క శర్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? మీరూ ఫాలో అవ్వొచ్చు..

నీతా అంబానీ ఎప్పుడూ పచ్చ రత్నాలున్న నెక్లెస్ నే ఎందుకు వేసుకుంటుంది?

మకర సంక్రాంతి కి అస్సలు చేయకూడని పనులు ఇవే

డేట్ నైట్ ట్రిప్స్ కి అదిరిపోయే బాడీకాన్ డ్రెస్సులు